రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లావాసి ప్రతిభ
భైంసాటౌన్: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సీఎంకప్ రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో జిల్లావాసి ప్రతిభ చా టాడు. తానూర్ మండలం హిప్నెల్లికి చెందిన వార్లే దిలీప్ అత్యుత్తమ ప్రదర్శనతో రజత పత కం సాధించినట్లు యోగా గురువు మల్లేశ్ తెలి పారు. తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నందన్ కృపాకర్, రాష్ట్ర సంయుక్త ఆర్గనైజింగ్ కార్యదర్శి రాంరెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ తోట సతీశ్, నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ దిలీప్‌ను అభినందించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment