విస్తృతంగా హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలి
● ఎయిడ్స్ కంట్రోల్ జేడీ రవికుమార్
భైంసాటౌన్: హెచ్‌ఐవీ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్, సుఖ వ్యాధుల నియంత్రణ నోడల్ అధికారి డాక్టర్ రవికుమార్ ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ విభాగాన్ని శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షలు, రిపోర్టులు, రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ బాధితులను గుర్తించి, సంబంధిత కుటుంబసభ్యులందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకోవడంతోపాటు వారికి హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించాలన్నారు. పాజిటివ్ వస్తే పుట్టబోయే బిడ్డకు ఎలాంటి చికిత్స అందించాలో వివరించారు. అలాగే విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. క్షయ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి నిర్ధారణ పరీక్షల కోసం రెఫర్ చేయాలని తెలిపారు. ఆయనవెంట ప్రోగ్రాం అధికారి బి.నాగరాజు, కౌన్సిలర్లు విలాస్, మహిపాల్, సతీశ్, ల్యాబ్ టెక్నీషియన్లు సుధాకర్, తౌఫిక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment