ప్రశాంతంగా ‘నవోదయ’ పరీక్ష
నిర్మల్ రూరల్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను గంట ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించారు. జిల్లా కేంద్రంలో 2 పరీక్ష కేంద్రాలు భైంసాలో 3, ఖానాపూర్‌లో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,479 మంది విద్యార్థులకు 1,310 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 169 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో జరిగే పరీక్షను డీఈవో రామారావు, విజయ హైస్కూల్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా పరీక్షల సహాయ అధికారి సిద్ధ పద్మ తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment