నూతన టెక్నాలజీతో నేరాలకు చెక్
● ఎస్పీ జానకీ షర్మిల
నిర్మల్‌టౌన్: నూతన టెక్నాలజీలతో నేరాలకు అడ్డుకట్ట వేయడానికి ఫోన్లు దోహదపడతాయని జిల్లా ఎస్పీ జానకీషర్మిల అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో డీజీపీ తెలంగాణ ద్వారా ఆమోదించబడిన ఈ సాక్ష(అడ్వాన్స్‌డ్ – ఇన్వెస్టిగేషన్)యాప్ కోసం రెండు మొబైల్ ఫోన్లు, 128 జీబీ మైక్రో ఎస్డీ కార్డ్‌లను జిల్లాలోని ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ మొబైల్ ఫోన్‌లోని సాక్ష యాప్‌లో నేరానికి సంబంధించిన సాక్ష్యాలు చెదిరిపోకుండా భద్రంగా ఉంటాయన్నారు. ఇందులో నేరాలకు సంబంధించిన వివరాలను తేదీల వారీగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ రికార్డు చేసి పొందుపరచడం జరుగుతుందన్నారు. దీంతో నేరస్తులకు తొందరగా శిక్షలు పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నూతన సాంకేతిక టెక్నాలజీ వినియోగంలో నిర్మల్ పోలీసులు దూసుకెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎస్పీ ఉపేంద్రారెడ్డి, అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment