మహిళలు స్వశక్తితో ఎదగాలి
నిర్మల్‌చైన్‌గేట్: మహిళలు స్వశక్తితో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆర్థికంగా ఎదగాలని మెప్మా పీడీ సుభాష్ అన్నారు. ఈడీఐఐ, యా క్సెంచర్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఏర్పాటుచేసిన హౌస్ హోల్డ్ సప్లస్ కామన్ ఫెసిలిటీ సెంటర్‌ను మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌తో కలిసి శని వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ సబ్బులు, డిటర్జంట్ పౌడర్, ఫినాయిల్, డిష్‌వాష్ లిక్విడ్, వాషింగ్ మిషన్ లిక్విడ్‌పై ట్రైనింగ్ తీసుకున్న మహిళల కోసం ఈ సెంటర్ ప్రారంభించడం జరిగిందన్నారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారులుగా ఎదగాలన్నారు. ఈద్‌గామ్ కౌన్సిలర్ రమ్య విజయ్, మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి శ్రీనివాస్, ఆర్పీ మమత, హాపిజా, ఈడీఐఐ మాస్టర్ ట్రైనర్స్ రవి, అలేఖ్య, దేవేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment