పేదలందరికీ ప్రభుత్వ పథకాలు
● మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రభుత్వం నూతనంగా అమలు చేయబోవు ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత కార్డులు(రేషన్ కార్డులు), ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను అర్హులందరికీ అందించాలని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల గుర్తింపునకు పకడ్బందీగా సర్వే చేయాలన్నారు. గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల వివరాలను వెల్లడించాలన్నారు. ఈ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, డీఏవో అంజిప్రసాద్, డీసీఎస్‌వో కిరణ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment