నిర్మల్‌చైన్‌గేట్: నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన డీట్ యాప్‌లో కళాశాలల విద్యార్థులు పేర్లు నమోదు చేసుకునేలా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫ్ తెలంగాణ జిల్లా కమిటీ సభ్యులతో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఈ యాప్‌లో నమోదు చేసుకున్న జిల్లా నిరుద్యోగుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ కల్పనలో డీట్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అధికారులు ఈ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. నిరక్షరాస్యులు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఈ యాప్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నిరుద్యోగులు ఇచ్చిన సమాచారం క్రోడీకరించుకుని యాప్‌లో ఆన్‌లైన్ రెజ్యూమ్‌ను పొందుపరుస్తుందన్నారు. ఆ సమాచారం ఆధారంగా కంపెనీలు నిరుద్యోగులను సంప్రదిస్తాయని తెలిపారు. ఇందులో తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా నైపుణ్యానికి తగ్గ వేతనం లభిస్తుందన్నారు. పలు కంపెనీల్లో ఖాళీలను డీట్ యాప్‌లో పొందుపరుస్తాయన్నారు. డీట్ యాప్ నిరుద్యోగులకు కంపెనీలకు మధ్య వారధిలా పని చేస్తుందని తెలిపారు. నిరుద్యోగులకు అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన ప్రజలు అనధికారిక ఏజెంట్ల ద్వారా ఇతర దేశాలకు ఉపాధి కోసం వెళ్తే వారి వివరాలను కుటుంబ సభ్యులు కార్మిక శాఖ కార్యాలయంలో వారి ఆధార్ కార్డుతో ఈనెల 26వ తేదీలోపు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 9866072044 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో పరిశ్రమల మేనేజర్ నరసింహారెడ్డి, సీపీవో జీవరత్నం, మెప్మా పీడీ సుభాష్, జిల్లా కార్మిక అధికారి ముత్యంరెడ్డి, డీవైఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment