రోడ్డు ప్రమాదాలు
గతేడాది రోడ్డు ప్రమాద కేసులు 312 నమోదుకాగా, 337 మంది మృతి చెందా రు. ఈ ఏడాదిలో 322 కేసుల్లో 335 మంది మృతి చెందారు. హెల్మె ట్లు ధరించని కారణంగా ఎక్కువ సంఖ్యలో ద్విచక్రవాహనదారులు మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మార్చి 8వ తేదీన వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామశివారులోని ఆగివున్న లారీని ఢీకొని మోర్తాడ్ మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు మాడవేణి రవీందర్(54), శివరాజ్(24) కన్నుమూశారు.
రోడ్డు రవాణా ఆదాయం రూ.14.63 కోట్లు
జిల్లాలో హెవీ, మీడియం, లైట్ మోటార్ వేకిల్స్, మోటార్ సైకిల్, మోపెడ్, ట్రాక్టర్స్ తదితర వాహనాలు 5.17 లక్షలు ఉండగా, వాటి ద్వారా టాక్స్‌ల రూపంలో రూ.14.63 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment