నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను
నిజామాబాద్‌నాగారం/నిజామాబాద్ రూరల్: నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, తాను ఏ తప్పూ చేయలేదని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే తనతోపాటు కేటీఆర్‌పై కాంగ్రెస్, బీజేపీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలైన తరువాత మొదటిసారి నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కవితకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆదివారం ఘనస్వాగతం పలి కారు. ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద బీఆర్‌ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ తోపాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు గజమాలతో ఆమెకు స్వాగతం పలికారు. అ క్కడి నుంచి వేలాది మందితో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్‌కాలనీ చౌరస్తాలో నాయకులు, కార్యకర్తలు బ తుకమ్మలు, డప్పువాయిద్యాలతో స్వాగతం పలికా రు. అక్కడి నుంచి పాదయాత్రగా బయల్దేరిన కవిత సుభాష్‌నగర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్నింటినీ ఎదిరించి వచ్చానని అన్నారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్లమని, గట్టిగా నిలబడుతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. హామీల అమలు లో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని, గ్రామగ్రామానా హామీలపై కాంగ్రెస్ నాయకులను నిలదీ యాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు లు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులతోపాటు అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఊరుకుంటే ప్రభుత్వం కదలదని, ప్రతి ఒక్క రూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. మహిళలక ఉచిత బస్సు అని చెప్పి బస్సుల సంఖ్య తగ్గించారని అన్నారు. బీఆర్‌ఎస్ సత్తాచాటి మరోసారి నిజామాబాద్ పవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డికి రుచి చూపిద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజాదరణ కోల్పోయిందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్‌కు చివరికి మిగిలేది ఆరు సీట్లేనని ఎద్దేవా చేశారు. రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను దోచుకుని ఢిల్లీలో పెడుతుందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలను వెంటాడుతామన్నారు.
అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. కవిత ఆరోగ్య బాగోలేక బతుకమ్మకు దూరంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మను కనబడకుండా చేసిందని విమర్శించారు. జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ విఠల్‌రావు, బోధన్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆయేషా ఫాతిమా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తప్పు చేయలేదు.. భయపడే ప్రసక్తే లేదు
కేసీఆర్‌ను ఎదుర్కోలేకే మాపై కేసులు
రానున్నది బీఆర్‌ఎస్ శకం.. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఘనస్వాగతం పలికిన బీఆర్‌ఎస్
నాయకులు, కార్యకర్తలు
Comments
Please login to add a commentAdd a comment