నగర అభివృద్ధికి కృషిచేస్తా
నిజామాబాద్ సిటీ : ఇందూరు నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని నుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశ వేణు అన్నారు. నగరంలోని 7, 8 డివిజన్‌లలో స్థానిక నాయకులతో కలిసి కేశ వేణు ఆదివారం పర్యటించారు. రోటరీనగర్ వాసులు కేశ వేణుకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. నగర అభివృద్ధికి నుడా నుంచి అవసరమైన మేరకు నిధులు విడుదలచేసే అవకాశం ఉంటే పరిశీలిస్తానన్నారు. ఇప్పటివరకు ఉన్న స్థానిక కార్పొరేటర్లు డివిజన్ అభివృద్ధిని పట్టించుకోకపోవడం కారణంగానే ఈ పరిస్థితి ఉందన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులకు అదనపు నిధులు మంజూరు అయ్యేలా కృషిచేస్తానన్నారు. అనంతరం కేశ వేణును రోటరీకాలనీ సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. వేణువెంట రామర్తిగోపి, రమేశ్, బంటు రామ్‌కుమార్, వెంకటేశ్వర్ చారి, నరసింహస్వామి, స్వామిగౌడ్, సతీశ్, హన్మాండ్లు, దత్తు, సుభాచారి, సుదర్శన్, రూప్‌సింగ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment