మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రి హత్య
రుద్రూర్: మద్యం తాగడానికి డబ్బు ఇవ్వలేదని ఓ కుమారుడు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన రుద్రూర్ మండలం అంబం (ఆర్) గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన షేక్ హైమద్(65)కు కుమారుడు మహబూబ్ అలియాస్ బబ్లూ ఉన్నాడు. హైమద్ భార్య ఇటీవల మృతి చెందడంతో ఇంట్లో తండ్రి కొడుకులే ఉండేవారు. మద్యానికి బానిసైన మహబుబ్ తాగడానికి డబ్బులు కావాలని తరుచు హైమద్‌తో గొడవ పడేవాడు. ఆదివారం రాత్రి డబ్బుల విషయమై ఘర్షణ జరిగింది. స్థానికులు జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పారు. అర్ధరాత్రి మళ్లీ మహబూబ్ తండ్రితో గొడవ పడి ముఖం, ఛాతీపై కొట్టాడు. దీంతో హైమద్ మృతి చెందాడు. సోమవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రుద్రూర్ సీఐ కృష్ణకుమార్, ఎస్సై సాయన్న వివరాలు సేకరించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment