విద్యార్థులను చైతన్యం చేయండి
నిజామాబాద్ అర్బన్: జూనియర్ కళాశాల స్థాయిలోనే విద్యార్థులను చదువుతో పాటు, క్రమశిక్షణ, యాంటీ డ్రగ్స్‌పై చైతన్యవంతం చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అధ్యక్షతన ప్రిన్సిపాల్స్‌తో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్ బోర్డు సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలన్నారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ సకాలంలో సిలబస్ పూర్తి చేసి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment