కారెంపూడి: పల్నాటి వీరారాధన ఉత్సవాల సందడి ఆదివారం కూడా కొనసాగింది. మండల ప్రజలతోపాటు పల్నాడులోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వీరుల గుడి ఉత్సవ ప్రాంగణానికి తరలివచ్చారు. వివిధ రకాల స్టాళ్లను సందర్శించి ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేశారు. పిల్లలు ఆడుకోడానికి అవసరమైన ఆట వస్తువులు కొన్నారు. రంగులరాట్నాలు, జెయింట్ వీల్స్ ఎక్కి చిన్నారులు కేరింతలు కొట్టారు. ప్రజలు వీరుల గుడిలోని ఆయుధాలను దర్శించుకుని పూజలు చేశారు. అంకాలమ్మ తల్లి, చెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. జన రద్దీతో కారెంపూడి తిరనాళ్లను తలపించింది.
Comments
Please login to add a commentAdd a comment