కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం | - | Sakshi
Sakshi News home page

కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

Published Sat, Nov 9 2024 2:21 AM | Last Updated on Sat, Nov 9 2024 2:21 AM

కార్త

కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో నిత్యన్నదానానికి ఏలూరు జిల్లా పూళ్ల గ్రామానికి చెందిన బొండాడ నాగేశ్వరరావు కుమారులు సబ్బరాజు, రాజా, సుధీర్‌ రూ.1,01,116 విరాళంగా సమర్పించారు. శుక్రవారం సాయంత్రం స్వామివార్లను దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రధా నార్చకుడు బుద్దు పవన్‌కుమార్‌శర్మకు విరాళాన్ని అందజేశారు. ఆలయ మర్యాదలతో దాత కుటుంబ సభ్యులను సత్కరించారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పవర్‌ ఎంప్లాయీస్‌ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

ఇబ్రహీంపట్నం: ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగింది. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నపూస సుబ్బిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎం. మోహన రావు, ప్రధాన కార్యదర్శి వి.సుబ్బిరెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులుగా నరసింహారావు, అబ్దుల్‌ హమీద్‌బాషా, మరో ఎనిమిది మంది సభ్యు లను ఎన్నుకున్నారు. మూడేళ్లుగా యూనియన్‌ చేపట్టిన కార్యక్రమాలపై సమీక్ష చేశారు. అధ్యక్షుడు మోహనరావు మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మాజీ పాలకవర్గ సభ్యులకు వీడ్కోలు పలికారు.

లబ్ధిదారుల ఇంటి వద్దే ఈకేవైసీ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అర్హులైన వినియోగదారుల ఇంటి వద్దే గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌తో ఈకేవైసీ నమోదు చేయిస్తున్నామని, దీనిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా శుక్ర వారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం సంవత్సరానికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేసే పథకాన్ని అక్టోబర్‌ 31న ప్రారంభించిందని తెలిపారు. దీనిలో భాగంగా జిల్లాలోని 55 గ్యాస్‌ ఏజెన్సీల్లో ఉచిత సిలిండర్ల బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ పథకానికి బియ్యం కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ కలిగిన వారు అర్హులని తెలిపారు. వినియోగదారులు తమ మొదటి ఉచిత సిలిండర్‌ను 2025, మార్చి 31వ తేదీ లోపు బుక్‌ చేసుకోవచ్చని సూచించారు. సిలిండర్‌ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలో గ్యాస్‌ సిలిండర్‌ ధర మొత్తం జమవుతుందని తెలిపారు. ఈకేవైసీ చేయించని గ్యాస్‌ వినియోగదారులకు వారి ఇంటి వద్దనే గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌తో ఈ కేవైసీ చేయించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. గ్యాస్‌ వినియోగదారులకు దీనిపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1967 టోల్‌ ఫ్రీ నంబరును లేదా సమీపంలోని సచివాల యంలో సంప్రదించాలని కోరారు.

సోలార్‌ మోడల్‌ గ్రామాల ఎంపికకు తీర్మానం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో ఐదు గ్రామాలను సోలార్‌ మోడల్‌ గ్రామాలుగా ఎంపిక చేయాలని సమావేశంలో తీర్మానించారు. జిల్లా కలెక్టరేట్‌లో ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ముప్త్‌ బిజిలీ యోజన’పై జిల్లా స్థాయి కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనర సింహం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పథకం అమలుపై చర్చించారు. సోలార్‌ మోడల్‌ గ్రామాలుగా ఐదు వేల జనాభాకు పైబడిన ఐదు గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు ఎస్‌ఈ ఎ.మురళీమోహన్‌ తెలిపారు. ఈ పథకం కింద గృహ వినియోగదారులకు అందించే రాయితీలు, మోడల్‌ గ్రామాల ఎంపిక, బ్యాంకర్ల నుంచి లబ్ధిదారులకు రుణ సదుపాయం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం ప్రధాన మంత్రి సూర్య ఘర్‌ ముప్త్‌ బిజిలీ యోజన పోస్టర్లను డీఆర్వో ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఈఈ టెక్నికల్‌ యు.హనుమయ్య, జిల్లా నోడల్‌ అధికారి ఎం.భాస్కరరావు, టౌన్‌ ఈఈ పి.రవీంద్ర బాబు, పి.హరిబాబు, ఎం.వసంతరావు, ఎ.సత్యనారాయణ, బ్యాంక్‌ కోఆర్డినేటర్‌ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం 1
1/2

కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం 2
2/2

కార్తికేయుని నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement