ఆద్యంతం.. నవరసభరితం
కూచిపూడి(మొవ్వ): పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి కళా పీఠం, హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వేదాంతం రత్తయ్య శర్మ కళావేదికపై మూడు రోజులుగా శోభాయమానంగా సాగిన కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. నాట్య ప్రదర్శనలో భాగంగా వేదవల్లిప్రసాద్ శిష్య బృందం ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలను ప్రదర్శించింది. కొత్తగూడెంకు చెందిన నాట్యాచారి సీతాలక్ష్మి ప్రసాద్ బృందం కృష్ణ జనన శబ్దం, బుడిబుడి నడకల అనే అంశాలకు లయకు తగ్గ అడుగులు వేస్తూ.. ప్రదర్శనలను రక్తి కట్టించింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్. కనకదుర్గ బృందం తిల్లానాకు వేగమైన కదలికలతో హస్త పాద విన్యాశాలతో ప్రదర్శించి ప్రేక్షకుల కరతాళ ధ్వనులందుకుంది. హైదరాబాద్‌కే చెందిన అన్నమయ్య మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ శిష్యబృందం బ్రహ్మాంజలి, దశావతారాలకు ఆహూతులను భక్తి భావంలో లోలలాడించింది. నిజామాబాద్‌కు చెందిన కరణం శ్రీనివాస్ శిష్య బృందం వినాయక స్తుతిని, వసంత స్వరజతి అంశాలకు బాణీలకు తగిన రీతిలో చక్కని అభినయంతో ఆకట్టుకుంది. చివరిగా గుడివాడకు చెందిన సరితా నెహ్రూ బృందం కదన కుతూహల తిల్లానాను, శివ పంచాక్షరి అంశాలను రక్తి కట్టించి అందరి మన్నలందుకుంది. నిర్వాహకులు నాట్య ప్రదర్శనలు నిర్వహించిన కళాకారులు, వారి నాట్య గురువులను జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు.
వైభవంగా కూచిపూడి పతాక స్తూప ఆవిష్కరణ..
కూచిపూడి పతాక స్వర్ణోత్సవాల వేడుకల్లో చివరి రోజైన ఆదివారం కూచిపూడి సంస్కృతి, కళకు ప్రతీకై న కూచిపూడి నాట్య పతాక స్తూపాన్ని ఆవ్కిరించి జాతికి అంకితం ఇచ్చారు. సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, డెప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా వేలాది మంది కళాకారులు, వందలాది మంది నాట్యాచార్యుల సమక్షంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపీఠంలో అలనాటి నాట్యాచార్యుల చిత్రాలను, అలంకరణ సామగ్రిని, నాట్యాచార్యులు అందుకున్న జ్ఞాపికలను తెలుపుతూ ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు.
ఘనంగా ముగిసిన కూచిపూడి
పతాక స్వర్ణోత్సవాలు
Comments
Please login to add a commentAdd a comment