జాతీయ స్థాయి పోటీలకు ఉమ్మడి కృష్ణా క్రీడాకారులు
గన్నవరం: జాతీయ స్థాయి మోడ్రన్ పెంటతలాన్ చాంపియన్‌షిప్ పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు అసోసియేషన్ జిల్లా ఇన్‌చార్జ్, కోచ్ డి.నాగరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయ వాడలో జరిగిన రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌లో ఉమ్మడి కృష్ణాకు చెందిన తలగడదీవి కుషాల్, కోట వర్షంత్, డి.రాకేష్, కడవకొల్లు కింగ్‌జార్జ్ ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు పేర్కొన్నారు. వారిని ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో నాసిక్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు సెలక్టర్లు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు నలుగురు క్రీడాకారులు నాసిక్ బయలుదేరి వెళ్లారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచి పతకాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రస్తుత జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామని ఉమ్మడి కృష్ణాజిల్లా ఉపాధి కల్పనా ధికారి డి.విక్టర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల మూడో తేదీ నుంచి ఈ శిక్షణ తరగ తులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బీఏ, బీబీఏ, బీకాం, ఎంకాం పూర్తి చేసిన 18 నుంచి 30 సంవత్సరాలలోపు అభ్యర్థులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనడానికి అర్హులని వివరించారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన వారికి ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పెనమలూరు మండలం కానూరు తులసీనగర్‌లో ఉన్న ఫెడరల్ స్కిల్ అకాడమీలో శిక్షణ తరగతులు జరుగుతాయని, ఆసక్తి ఉన్న వారు విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ఫెడరల్ స్కిల్ అకాడమీలో పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరా లకు 87146 92749, 87146 92748 సెల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మత్స్యకారులకులైసెన్సు పత్రాల అందజేత
చిలకలపూడి(మచిలీపట్నం): మత్స్యకార బోటు యజమానులకు మత్స్యశాఖ ద్వారా జారీ చేసిన రిజిస్ట్రేషన్, లైసెన్సు పత్రాలను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ మంగళవారం తన చాంబర్‌లో అందజేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయవాడలో సంభవించిన వరదల ముందు బాధితులను రక్షించేందుకు అత్యవసరంగా బోట్లు అవసరమవగా కలెక్టర్ మంగినపూడి బీచ్ ప్రాంతానికి వెళ్లి మత్స్యకారులతో మాట్లాడి బోట్లను లారీల్లో అక్కడికి తరలించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా బోటు యజమానులకు బోటు రిజిస్ట్రేషన్, లైసెన్సు పత్రాలు ఆయన అందజేశారు. బోటు యజమానులు కలెక్టర్‌ను సత్కరించి కృత జ్ఞతలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ.. మత్స్యకారుల నుంచి ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్, లైసెన్స్ పత్రాలు అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఇన్‌చార్జ్ జాయింట్ డైరెక్టర్ నాగబాబు, జిల్లా మత్స్యకారుల సహకార సంఘాల అధ్యక్షుడు కొక్కిలిగడ్డ వెంకటరమేష్ తదితరులు పాల్గొన్నారు.
10 నుంచి
క్రెడాయ్ ప్రాపర్టీ షో
లబ్బీపేట(విజయవాడ తూర్పు): క్రెడాయ్ విజయవాడ చాప్టర్ పదో ప్రాపర్టీ షో ఈ నెల 10, 11, 12 తేదీల్లో విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతుందని చాప్టర్ అధ్యక్షుడు డి.రాంబాబు తెలిపారు. ప్రాపర్టీ షో ప్రారం భోత్సవానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం సచివాలయంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రం అందించామన్నారు. ఈ ప్రాపర్టీ షోలో బిల్డర్లు, గృహోపకరణాల కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పాల్గొని తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తాయని, స్పాట్‌లో రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు కూడా పాల్గొంటారని వివరించారు. సీఎంను కలిసిన వారిలో కార్యదర్శి వి.శ్రీధర్, కె.రఘురామ్, వంశీకృష్ణ, సాయిభాస్కర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment