పదోన్నతుల్లో లోపాలు సవరించండి
మచిలీపట్నంటౌన్: పదోన్నతుల్లో లోపాలు సవరించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ–సీ ఉద్యోగ సంఘ నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో పని చేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ , బీసీ–సీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగులు ధర్నా చేశారు. స్థానిక కేడీసీసీ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేసి ప్లకార్డులు ప్రదర్శించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చీఫ్ మేనేజర్లుగా ప్రమోషన్ పొందిన ఆ కేడర్‌కు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకపోవడాన్ని ఉద్యోగుల సంఘ నాయకులు తప్పు పట్టారు. మెరిట్‌లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను రిజర్వేషన్ స్థానాల్లో కాకుండా ఓపెన్ కేటగిరిలో పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగులు ఎం.వెంకటేశ్వర్లు, పి. బాబూరావుకు 2024 జూన్ 13న పదోన్నతి ఇచ్చి కారణాలు చెప్పకుండా పదోన్నతి జీతాలు ఇవ్వకపోవడాన్ని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆ సంఘ రాష్ట్ర పర్యవేక్షకుడు అశోక్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కె.రమేష్, బి.గంటమ్ నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు బి హరీష్‌నాయక్, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న ఉద్యోగులకు దళిత జేఏసీ జిల్లా అధ్యక్షుడు జక్కుల ఆనంద్‌బాబు(జానీ), జైభీమ్‌సేన సంఘం రాష్ట్ర వ్యవస్ధాపకుడు బూరగ రామారావు, నాయకుడు తప్పెట రాజు, దళిత సంఘాల నాయకులు, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నేతలు తదితరులు మద్దతు తెలిపారు.
కేడీసీసీ బ్యాంక్ యాజమాన్య తీరుకు నిరసనగా ఉద్యోగుల ధర్నా
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన
మద్దతు తెలిపిన దళిత సంఘాల నేతలు
Comments
Please login to add a commentAdd a comment