ఇంత అలసత్వమా..!
● సాధారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్నా.. రిఫర్ చేస్తున్న వైద్య సిబ్బంది
● క్లిష్టమైన ప్రసవాలు 108 సిబ్బంది చేస్తున్న వైనం
● జనవరి నుంచి అక్టోబర్ వరకు 108లో 42 ప్రసవాలు
● కొద్ది రోజుల క్రితం ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో జె.స్వప్న చేరింది. ఆమెను అక్కడ వైద్యులు విజయనగరం ఘోషాస్పత్రికి రిఫర్ చేసారు. దీంతో వారి కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్.కోట ఆస్పత్రిలో ఉన్న గర్భిణి స్వప్నను ఘోషాస్పత్రికి తరలిస్తుండగా కాపు సోంపురం వద్దకు వచ్చే సరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో 108 ఈఎంటీ పి.వి.రమణ అంబులెన్సును పక్కన ఆపి ప్రసవం జరిపించారు. ఆమెకు పండంటి ఆడ శిశువు జన్మించింది.
విచారణ చేపడతాం..
సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి రిఫరల్ ఆస్పత్రులకు ఎందుకు గర్భిణులను రిఫర్ చేస్తున్నారనే దానిపై విచారణ చేపడతాం. ప్రసవం చేయగలిగే అవకాశం ఉన్న కేసులను రిఫర్ చేస్తే చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్ బి.రాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్
Comments
Please login to add a commentAdd a comment