కొరాపుట్ జిల్లాలో దర్శకుడు రాజమౌళి
● మహేష్‌బాబు చిత్రం కోసం లొకేషన్ల వేట
కొరాపుట్: ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు రాజమౌళి కొరాపుట్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం సిమిలిగుడలో ఓ హోటల్లో బసచేశారు. నటుడు మహేష్‌బాబుతో కలిసి తెరకెక్కనున్న భారీ బడ్జెట్ సినిమా కోసం కొరాపుట్‌లో లోకేషన్లు పరిశీలిస్తున్నారు. విశాఖ నుంచి ఐదుకార్లతో రాజమౌళి బృందం తరలివచ్చింది. దేవమాలి, కొలాబ్, గుప్తేశ్వరం, మాచ్‌ఖండ్, పుట్‌సీల్, పుంజ్ సీల్, తోలో మాలీ తదితర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వాస్తవానికి ఒక్క రోజులో చూసి వెళ్లిపోవాలని జక్కన్న అనుకున్నప్పటికీ కొరాపుట్ జిల్లాలో దండకారణ్యం లొకేషన్లు నచ్చి మరో రోజు సిమిలిగుడలో బస చేయనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment