ఒకటి నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాలు
రాయగడ: రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి వారం రోజుల పాటు జిల్లాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్టీవో శివశంకర్ చౌదరి వెల్లడించారు. శనివారం సాయంత్రం ఈ మేరకు స్థానిక అటానమస్ కశాశాల సమావేశం హాల్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాబిలత షరఫ్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, ఈడీఈవో భజన్‌లాల్ మాఝి, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అర్చన పట్నాయక్, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారు. ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా రోడ్డు భద్రత వారోత్స
వాల్లో భాగంగా ముందస్తుగా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతీ కళాశాల, పాఠశాలల విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని పట్టణంలో చైతన్య ర్యాలీలు నిర్వహిస్తారని ఈ సందర్భంగా ఆర్టీవో చౌదరి అన్నారు. అలాగే ఆటో, లారీ డ్రైవర్లకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహించేందుకు శిబిరాలను నిర్వహిస్తామని వివరించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడంతో పాటు అతివేగం ప్రాణాంతకమన్న అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగిస్తామన్నారు.
ఆర్టీవో శివశంకర్ చౌదరి
Comments
Please login to add a commentAdd a comment