సాహితీ సంస్థ వార్షికోత్సవానికి సన్నాహాలు
జయపురం: జయపురంలో ప్రముఖ సాహితీ సంస్థ పూజపూజ్య సంసద్ తన 28వ వార్షికోత్సవాన్ని జరిపేందుకు విస్తృత సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆదివారం సంస్థ కార్యవర్గ సభ్యులు సన్నాహక సమావేశం నిర్వహించి చర్చించారు. పూజ పూజ్య సంసద్ అధ్యక్షులు ఉదయ శంకర జాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో వార్షికోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జనవరి 27 నుంచి 31వ తేదీ వరకు వివిధ పోటీలు నిర్వహించాలని, సావనీర్ విడుదల చేయాలని తీర్మాణించింది. ఫిబ్రవరి 15వ తేదీలోగా ఆ పత్రిక ముద్రణ పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకు తమ అమూల్యమైన రచనలు, కవితలు కథలు, వ్యాసాలు మొదలగు రచనలు సభ్యులు, రచయితలు, సాహితీ వేత్తలు అందజేయాలని సభాముఖగా విజ్ఞప్తి చేశారు. 2025 మార్చి రెండో తేదీన వార్షికోత్సవం జరిపేందుకు సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. సమాజంలో సాహిత్య, కళల, క్రీడలు, సమాజ సేవ, సాంస్కృతిక రంగాలలో ఉత్తమ సేవలు అందించిన వారిని ఘనంగా సన్మాణించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అటువంటి వ్యక్తుల పేర్లు అందజేయాలని ప్రతినిధులు కోరారు. వార్షికోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఫిబ్రవరి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని సమావేశం నిర్ణయించింది. పూజపూజ సంసద్ ప్రధాన సలహాదారు, ఇంజినీర్, కేధార్ నాథ్ బెహర, ఇంజినీర్ భాస్కర సామంతరాయ్, ఉపాధ్యక్షులు తపన కిరణ్ త్రిపాఠీ, సహాయ కార్యదర్శి మృత్యంజయ సాహు, కోశాధికారి సరస్వతీ సాహు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment