పార్టీ కార్యాలయాల్లో ‘నూతన’ సందడి
పర్లాకిమిడి: స్థానిక బీజేడీ, బీజేపీ కార్యాలయాల్లో నూతన సంవత్సర వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. ఆంగ్ల సంవంత్సరం ప్రారంభం సందర్భంగా స్థానిక రాంనగర్ హైటెక్ ప్లాజాలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహికి బీజేడీ పార్టీ శ్రేణులు బసంత్ దాస్, రాష్ట్ర బీజేడీ సాధారణ కార్యదర్శి ప్రదీప్ నాయక్, జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతిరావు, కాశీనగర్ ఎన్‌ఏసీ చైర్మన్ మేడిబోయిన సుధారాణి, గుసాని సమితి అధ్యక్షులు ఎన్.వీర్రాజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఇరదల వీధిలో బీజేపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు కోడూరు నారాయణరావుకు పలువురు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవంత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment