పూరీలో తొక్కిసలాట
భువనేశ్వర్ : నూతన సంవత్సరం తొలి రోజున పూరీ జగన్నాథుని దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తడంతో తోపులాటకు దారితీసింది. రద్దీని నియంత్రించడంలో అధికారులు విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరుస క్రమంలో భక్తులకు దర్శనం కల్పించేందుకు శ్రీమందిరం సింహద్వారం నుంచి సుమారు అర కిలోమీటరు దూరం మార్కెట్ కూడలి వరకు తాత్కాలిక బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ హద్దు ఆవలి నుంచి భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. దర్శనం కోసం సుదీర్ఘంగా నిరీక్షంచాల్సి రావడంతో సహనం కోల్పోయి బారికేడ్ల హద్దుని అధిగమించి శ్రీమందిరం లోనికి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. కొత్త సంవత్సరాది ముందు రోజున జరిగిన తోపులాటలో 10 మంది పైబడి భక్తులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.
భారీగా బారులు తీరిన భక్తులు (ఇన్‌సెట్లో)
తోపులాటలో భక్తులు
Comments
Please login to add a commentAdd a comment