అఖిల ఒడిశా లాయర్స్ అసోసియేషన్ ఎడిటర్‌గా గాయత్రిదేవి
జయపురం: జయపురం జిల్లా బార్ అసోసియేషన్ సభ్యురాలు, జయపురం స్పెషల్ పోక్సో కోర్టు ప్రభుత్వ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ బి.గాయిత్రీ దేవిని అఖిల ఒడిశా లాయర్స్ అసోసియేషన్ ఎడిటర్‌గా నియమించారు. ఈ నెల 29,30 తేదీల్లో మల్కన్‌గిరి అఖిల ఒడిశా లాయర్స్ అసోసియేషన్ 53వ కన్వెన్షన్ నిర్వహించారు. కార్యక్రమంలో గాయత్రీ దేవి సేవలను వక్తలు కొనియాడారు. ఆమె ప్రతిభను గుర్తించిన రాష్ట్ర లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్‌కు ఎడిటర్‌గా నియమించి గౌరవించింది.
ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు
భువనేశ్వర్: ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని సైకత యానిమేటరుగా పేరొందిన మానస కుమార్ సాహు అపురూపమైన శిల్పం ఆవిష్కరించాడు. పూరీ సాగర తీరంలో ఈ శిల్పం సందర్శకులు, పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment