పొద్దు తిరుగుడు సాగుపై రైతులకు అవగాహన
రాయగడ: తక్కువ పెట్టుబడి అధిక దిగుబడినిచ్చి రైతుల ఆర్థిక పురోగతికి దోహదపడే పొద్దు తిరుగుడు పువ్వుసాగుపై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తుంది. రాయగడ జిల్లాలోని మునిగుడలో 2025–26 రవీ సీజన్‌లో రైతులకు ఈ సాగుపై ఆసక్తి కనబరిచేలా అధికారులు సన్నహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మునిగడు వ్యవసాయ శాఖ అధికారి నిరంజన్ సతపతి, సమితి వ్యవసాయ శాఖ అధికారి దీప్తి రాణి పట్నాయక్ తదితరులు మంగళవారం రైతులకు పొద్దు తిరుగుడు సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు మేలు రకమైన విత్తనాలను పంపిణీ చేశారు. రబీ సాగులో భాగంగా పొద్దు తిరుగుడును అధిక విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులకు అవగాహన కల్పించారు. సమితిలో ఈసారి సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో పొద్దు తిరుగుడు సాగు చేసే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సతపతి తెలియజేశారు. అందుకు ఇప్పటి నుంచే రైతులకు ఈ పంటపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment