ఖుర్దారోడ్ – బొలంగీరు మధ్య కొత్త ప్యాసింజర్ హాల్ట్
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే ఖుర్దా రోడ్–బొలంగీర్ రైలు మార్గంలో కొత్తగా సన్నొపొదొరొ ప్యాసింజర్ హాల్ట్‌ను ప్రారంభించారు. స్థానిక లోక్‌సభ సభ్యురాలు అపరాజిత షడంగి సోమవారం ఈ కొత్త స్టేషన్ భవనం ప్రారంభించారు. ఆమెతో బెగుణియా ఎమ్మెల్యే ప్రదీప్ కుమార్ సాహు, ఖుర్దారోడ్ మండల రైల్వే అధికారి హెచ్‌ఎస్ బాజ్వా అతిథులు గా పాల్గొన్నారు. స్థానికుల అభ్యర్థన మేరకు రైల్వే శాఖ సన్నొపొదొరొ ప్యాసింజర్ హాల్ట్‌ను తెరవాలని నిర్ణయం తీసుకుందని ఎంపీ ప్రకటించారు. ఈ స్టేషన్‌లో ప్రయాణికుల కోసం ఆధునిక సౌకర్యాలు అమర్చారు. రూ.55 లక్షలు వెచ్చించి 450 మీటర్ల ప్లాట్‌ఫారం నిర్మించారు. రైలు కోసం నిరీక్షించే ప్రయాణికుల సౌకర్యానికి ప్లాట్‌ఫారంపై 30 మంది ప్రయాణికులు, వెయిటింగ్ రూమ్‌లో 13 మంది విశ్రమించేందుకు వీలు కల్పించారు. సన్నొపొదొరొ పాసింజరు హాల్టు స్టేషనులో సోమవారం నుంచి ఒక ఎక్స్‌ప్రెస్ రైలుతో సహా నాలుగు జతల పాసింజరు రైళ్లనుఇప్పుడు సన్నొపొదొరొలో నిలుపుతారు.
Comments
Please login to add a commentAdd a comment