అవకాశాలను అందిపుచ్చుకోవాలి
● జిల్లా ఉపాధి కల్పనాధికారి మహాపాత్రో
రాయగడ: పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రభుత్వం కల్పించే అప్రంటిష్‌ను పూర్తి చేసు కుని వచ్చే అవకాశాలను సద్వినియోగపరుచుకుంటే వారి భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని జిల్లా ఉపాఽధి కల్పనాధికారి తత్వమహి మహాపాత్రో అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ప్రిన్సిపాల్ వినోద్‌కుమార్ బసంతరాయ్ అధ్యక్షతన సోమవా రం ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహాపాత్రో మాట్లాడుతూ.. జిల్లాలోని అనేక భారీ పరిశ్రమలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కూడా అదే తరహాలో లభిస్తాయని అన్నా రు. అందుకు ప్రతీ విద్యార్థి ముందస్తు సమాచారంతో ఉపాధి అవకాశాల గురించి అన్వేషణలో ఉండా లని అన్నారు. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం విద్యార్థులు అవకాశాలు వచ్చే పరిశ్రమల్లో అప్రెంటిషిప్‌లను క్రమశిక్షణతో పూర్తి చేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం అదనపు ఐపీవో చిత్తరంజన్ మల్లిక్ ఉపాధి అవకాశాలు లభించే విధానాన్ని వివరించారు. జిల్లాలోని జేకే పేపర్ మిల్, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లాయీస్, ఎల్‌అండ్‌టీ, ఫెమాక్రోమ్ పరిశ్రమల మానవ వనరుల అధికారులు, శాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment