ఐక్యతకు చిరునామా
మంథని: చిల్లపల్లి గ్రామ పంచాయతీ జాతీయ స్థాయిలో మెరిసింది. ఆ గ్రామ మహిళల ఐక్యతకు చిరునామాగా నిలిచింది. అనేక మంది పేదమహిళలు స్వయం ఉపాధి ద్వారా వివిధ వ్యాపారాలు ని ర్వహిస్తున్నాయి. అనతికాలంలోనే ఆర్థికాభివృద్ధి సాధించి కుటుంబాలకు బాసటగా, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ కింద జాతీయ స్థాయి అవార్డుకు కేంద్రప్రభుత్వం ఎంపిక చేయడంపై మహిళలు, గ్రా మస్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
స్వయం ఉపాధితో అగ్రగామిగా..
మహిళలు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది స్వ యం ఉపాధి ఎంచుకుంటున్నారు. వీరు ఆర్థికాభివృద్ధి సాధించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రోత్సహి స్తోంది. తద్వారా మహిళలు తీసుకున్న రుణాల్లో వందశాతం సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో 33 స్వశక్తి సంఘాలు ఉడగా 335 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఇప్పటివరకు రూ.3.35 కోట్ల వరకు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు పొందారు. రుణవాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించడమే కాకుండా పొదుపు ఖా తాల్లో సైతం జమ చేస్తున్నారు. ఇక్కడి సంఘాల్లో రూ.4.45 లక్షలు పొదుపు చేసుకున్నారు. అలాగే సీ్త్రనిధి ద్వారా 79 సంఘాలు రూ.34 లక్షలు రుణం పొంది స్వయం ఉపాధి పొందుతున్నారు.
వ్యాపారాభివృద్ధి..
బ్యాంకుల నుంచి పొందిన రుణం ద్వారా మహిళలు అనేక వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఇందులో ప్రధానంగా టైలరింగ్, బ్యూటీపార్లర్, జనరల్ స్టోర్ట్స్, కంగన్‌హాల్స్, పాడి గేదెలు, మినీ ఏటీఎం, ప్యాడీ సెంటర్ల నిర్వహణ.. ఇలా వ్యాపారాలు ప్రారంభించారు.
సంక్షేమ పథకాల అమలులో కీలకం..
గ్రామంలోని మహిళా సంఘాలన్నీ గ్రామ సంఘంగా ఏర్పడ్డారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూరేలా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతు బాధ్యతులు అప్పగించగా.. ఆ పనులు పూర్తిచేసి మంచి పేరు సాధించుకున్నారు. ఇలా గ్రామంలో మహిళలు ఐక్యతను చాటి ఆదర్శంగా నిలిచారు.
సంతోషంగా ఉంది
అనేక మహిళా సంఘాలకు రుణాలు ఇప్పిస్తున్నాం. చిల్లపల్లి గ్రామానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం సంతో షాన్నిచ్చింది. మహిళలు ఐక్యతకు మారుపేరుగా నిలిచారు. నెలకు రెండు సమావేశాలు నిర్వహించి వివిధ అంశాలపై చర్చిస్తారు. వాటికి నన్ను ఆహ్వాని స్తారు. స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆ ర్థికాభివృద్ధి సాధించడం సంతోషంగా ఉంది.
– సంతోషం పద్మ,
డీఆర్డీఏ ప్రాజెక్టు మేనేజర్, మంథని
నెలకు రూ.15వేల ఆదాయం
స్వశక్తి సంఘం నుంచి రుణం పొందిన. ఫికో, కుట్టు మిషన్ కొనుగోలు చేసిన. వీటిద్వారా నెలకు రూ.15 వేల వరకు ఆదాయం వస్తంది. రెండేళ్లలో సమకూరిన ఆదాయంతో సొంతంగా ఇల్లు కట్టుకున్నం. చీరలు, ఫాల్స్ విక్రయిస్తూ ఇంకో కుట్టు మిషన్ కొనుగోలు చేసిన. మరికొందరికి కుట్టు మిషన్‌పై శిక్షణ ఇస్తున్న.
– రామిళ్ల మల్లేశ్వరి, దర్జీ
ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళా సంఘాల కార్యకలాపాలు
ఫ్రెండ్లీ ఉమెన్ విభాగంలో అవార్డు
జాతీయస్థాయిలో పురస్కారం రావడంపై చిల్లపల్లివాసుల ఆనందం
బ్యూటీపార్లతో ఉపాధి
మహిళా సంఘం నుంచి రూ.లక్ష లోన్ తీసుకుని బ్యూటీపార్లర్ ఏర్పాటు చేసిన. వివాహాలు, శుభకార్యాల సందర్భంగా ఆదాయం బాగానే వస్తంది. దీంతో రెండు కుట్టుమిషన్లు కొనుగోలు చేసిన. నెలకు రూ.8 వేల – రూ.10 వేలు వస్తంది. మా ఆయన ఆదాయానికి నా సంపాదన తోడవడంతో ఇబ్బందుల్లేకుండా ఉంది.
– కటుకూరి కృష్ణవేణి,
బ్యూటీపార్లర్ యజమాని
Comments
Please login to add a commentAdd a comment