అభివృద్ధి చేస్తా
గతేడాది కోతల్లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకు చిన్నఇబ్బంది కూడా తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. కొత్త ఏడాదిలోనూ రైతులకు మరింత సమర్థవంతంగా మేలు చేసేలా ప్రణాళిక రూపొందిస్తాం. విధి నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన ప్రతీఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించేలా నా వంతు ప్రయత్నం చేస్తా. విద్య, వైద్యం మరింత మెరుగుపరిచేలా చొరవ తీసుకుంటాం. ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు పతకాలను పకడ్బందీగా అమలు చేస్తాం. ఇందుకోసం అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తాం. వీరి స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధి చేస్తాం. అవినీతి, నిర్లక్ష్యానికి ఆస్కారం లేకుండా కొత్త సంవత్సరంలో అధికార యంత్రాంగం మరింత బాధ్యతతో పనిచేసేలాచే లక్ష్యం నిర్దేశిస్తాం.
– కోయ శ్రీహర్ష, కలెక్టర్
గ్రీవెన్స్ సమస్యలపై ఫోకస్
రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో వచ్చే ఫిర్యాదులకు శాశ్వత పరిష్కా రం చూపుతాం. ఒకసారి వచ్చి న ఫిర్యాదు మరోసారి రాకుండా సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతాం. పారిశుధ్యం నిర్వహణ, తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. గతేడాది పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం. భవిష్యత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపడతాం. గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు సాధించాయి. కొత్త సంవత్సరంలోనూ మరిన్ని అవార్డులు సాధించేలా ప్రణాళికతో ముందుకుసాగుతాం.
– అరుణశ్రీ, అదనపు కలెక్టర్
భూ సమస్యలకు పరిష్కారం
ప్రభుత్వ లక్ష్యం మేరకు అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా పాలన కొనసాగిస్తాం. కొత్త రెవెన్యూ చట్టం ఆధారంగా, భూమాత పోర్టల్ ద్వారా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తాం. దీనికే తొలి ప్రాధాన్యం ఇస్తాం. రైతులకు ఇబ్బందులు కలుగ కుండా వానాకాలం ధాన్యం కొనుగోలు చేశాం. భ విష్యత్‌లోనూ ధాన్యంలో కోతల్లేకుండా సజావుగా కొనుగోళ్లు సాగేలా చర్యలు తీసుకుంటాం. రైస్ మిల్లుల నుంచి పెండింగ్ సీఎమ్మార్‌ను కచ్చితంగా వసూలు చేస్తాం. – వేణు, అదనపు కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment