చేతల్లో చూపిస్తున్నాం
● రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు ● ప్రతీరైతుకు రుణమాఫీ చేస్తాం ● డీసీసీ అధ్యక్షుడు ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: ప్రజాప్రభుత్వం మాటల్లో కాదని, చేతల్లో చేసి చూపిస్తోందని డీసీసీ అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అర్హులైన రైతులందరికీ రూ.2లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని ఆయన తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, జెన్‌కో భాగస్వామ్యంతో కోల్‌బెల్ట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని, పారిశ్రామిక అభివృద్ధి కోసం విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజీలో అదనపు కోర్సులు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. రామగుండంలో త్వరలో ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. బండలవాగు ప్రాజెక్టు పూర్తిచేసి పంటలకు సాగునీరు అందిస్తామని ఆయన వివరించారు. సమావేశంలో నాయకులు కాల్వ లింగస్వామి, మహంకాళి స్వామి, మారెల్లి రాజిరెడ్డి, కొలిపాక సుజాత, పెద్దెల్లి తేజస్విని, తిప్పారపు శ్రీనివాస్, ముస్తాఫా, బొమ్మక రాజేశ్, నాయిని ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బంగ్లాస్ ఏరియాలోని సీపీ నివాసానికి వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాంతిభద్రతల పరిస్థితి గురించి కొద్దిసేపు సీపీతో చర్చించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు ముస్తఫా, కాల్వ లింగస్వామి, ఫక్రుద్దీన్, పాతపెల్లి రవికుమార్, యుగేందర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment