తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు?: కేటీఆర్‌ ఫైర్‌ | Ex Minister KTR Serious Comments Over Congress And CM Revanth | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు?: కేటీఆర్‌ ఫైర్‌

Published Fri, May 31 2024 1:02 PM | Last Updated on Fri, May 31 2024 1:02 PM

Ex Minister KTR Serious Comments Over Congress And CM Revanth

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. తెలంగాణలో వేలాది మంది అమరులు అయ్యింది కాంగ్రెస్‌ పార్టీ వల్లనే అంటూ విమర్శించారు. అమరవీరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల? అంటూ ప్రశ్నించారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..
‘తెలంగాణాలో వేలాది మంది అమరులు అయ్యింది ఎవరి వల్ల? అమరవీరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరివల్ల?. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు?’  

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

1969-71 తొలిదశ ఉద్యమంలో 370 తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరు?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

1971 పార్లమెంట్ ఎన్నికల్లో 11/14 సీట్లలో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు ?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

2004లో  మాట ఇచ్చి, పదేళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు ?

❌ కాంగ్రెస్ ప్రభుత్వం

రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత  ఎవరు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement