సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భయంకరమైన కరువు ఏర్పడేలా ఉందని.. నీళ్లు ఉన్న ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. సాగు తాగు, నీటికి కటకట వస్తుందని.. కాళేశ్వరంలో నీళ్లు ఉన్న వదలడం లేదన్నారు. సీఎం వ్యవహారం చూస్తే తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నట్లు ఉందన్నారు.
రేవంత్ డీఎన్‌ఏలో బీజేపీ ఉందని, ఆయన రేసు గుర్రం కాదు కీలు గుర్రం అంటూ అభివర్ణించారు కవిత. గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సమీక్ష చేయటం లేదు. ఉద్యోగాల రిజర్వేషన్లలో రోస్టర్ విధానం తీసుకొచ్చారు. మేము ప్రభుత్వాన్ని పడగొట్టం. బీజేపీయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది. కేసీఆర్ నియంత అన్న మేధావులు రేవంత్ రెడ్డి ఉద్యోగాల రిజర్వేషన్‌పై చేస్తున్న కుట్రలను ఎందుకు ప్రశ్నించటం లేదు. మేధావుల మౌనం చాలా ప్రమాదం. అంతు చూస్తా అంటున్న రేవంత్‌పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’’ అని కవిత డిమాండ్ చేశారు.
మహిళ వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కార్‌పై ముద్ర పడబోతోంది. పూర్తిగా మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉంది. మొన్న ఇచ్చిన 30 వేల ఉద్యోగాల్లో ఎంత మంది మహిళలకు వచ్చాయి. పాత జీవోలు రద్దు చేసి, కొత్త జీవోలు ఇస్తున్నారు. దీక్షకు అనుమతులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడెందుకు ఇవ్వటం లేదు. మరో గంట వేచి చూసి కోర్టుకు వెళ్లి రేపటి ధర్నా అనుమతి తెచ్చుకుంటాం. కాంగ్రెస్ అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు అనుమతి తెచ్చుకొని బతుకమ్మలు ఆడిన చరిత్ర మాది’’ అని కవిత పేర్కొన్నారు.
ఇదీ చదవండి: TS: కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. పరిశీలనలో పేర్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment