ఢిల్లీ: తనను చంపేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నారని టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వర రావు ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ తనను రెడ్ బుక్‌లో ఎక్కించారని, తనకు లోకేష్ నుంచి ప్రాణ హాని ఉందన్నారు ఆకుల వెంకటేశ్వరరావు. కేంద్రఎన్నికల సంఘం వద్ద చంద్రబాబును ఆకుల వెంకటేశ్వరరావు అడ్డుకున్నారు. ఆకుల వెంకటేశ్వరరావును టీడీపీ ఆఫీస్ సిబ్బంది పక్కకు నెట్టేశారు.
ఈ క్రమంలోనే మీడియా వద్ద గోడు వెళ్లబోసుకున్నారు ఆకుల వెంకటేశ్వరరావు. ‘పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న. జూబ్లీ హిల్స్ లో 400 గజాల భూమిని చంద్రబాబు మనిషి కే ఎల్. నారాయణ లాకున్నారు. న్యాయం చేయాలని అడిగితే పట్టించుకోవడంలేదు. నన్ను వాడుకొని వదిలేశాడు.నాకు చంద్రబాబు అన్యాయం చేశారు. పార్టీ లేదు, ఏమీ లేదు అన్న అచ్చెనాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేశారు’ అని విమర్శించారు ఆకుల వెంకటేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment