సాక్షి, తాడేపల్లి: తిరుమల పవిత్రతకు చంద్రబాబు భంగం కలిగించారని.. ఆయన చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘రాజకీయ దుర్భిద్ధితోనే చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారని.. కల్తీ జరగకుండానే జరిగిందని చెబుతున్నారంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. వైఎస్సార్‌సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.
‘‘తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబుగారు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారం రోజున పూజల్లో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిస్తోంది’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
తిరుమల పవిత్రతను,
స్వామివారి ప్రసాదం విశిష్టతను,
వెంకటేశ్వరస్వామి వైభవాన్ని,
టీటీడీ పేరు ప్రఖ్యాతులను,
వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను,
రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2024
Comments
Please login to add a commentAdd a comment