సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ కౌంటరిచ్చింది. ఎవరిది దరిద్రపు పాలనలో చంద్రబాబుకు ఒక్కసారి గణాంకాలతో సహా గుర్తు చేసింది. ప్రజలకు ఎవరు మంచి చేశారో.. వారిని ఎవరు ముంచారో వివరించింది. చంద్రబాబు గత పాలన చరిత్రను ఒకసారి రివైండ్ చేసింది.
కాగా, వైఎస్సార్‌సీపీ ట్విట్టిర్ వేదికగా..
ఎవరిది దరిద్రపు పాలనో ఈ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
నడిచొచ్చే 75 ఏళ్ల అబద్ధమా.. చంద్రబాబు ఎవరిది దరిద్రపు పాలన?2014-19 మధ్య ఐదేళ్లలో పంటల బీమా కింద మీరు ఇచ్చింది రూ.3,411 కోట్లే కదా?. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చింది రూ.7,802 కోట్లు కదా? మరి ఎవరిది దరిద్రపు పాలన?
ఉచిత పంటల బీమా మీ హయాంలో లేదు. రైతులపై పైసా భారం లేకుండా ఉచిత పంటల బీమాను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అమలు చేశారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?.
రైతులకు పంట రుణాలపై సున్నా వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లు బకాయిలు పెట్టి పథకాన్ని నిర్వీర్యం చేశావు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలతో కలిపి రైతులకు అందించిన వడ్డీ రాయితీ రూ.2,050 కోట్లు. మరి ఎవరిది దరిద్రపు పాలన?
ఉచిత విద్యుత్‌ను నీరుగారుస్తూ రూ.8,845 కోట్లు బకాయిలు పెట్టిన చరిత్ర మీది. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ రూ.43,744 కోట్లు వైఎస్ జగన్‌హయాంలో అందించారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?
ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ లోనే పరిహారం ఇచ్చిన దాఖలాలు మీ హయాంలో ఎప్పుడూ లేవు. ఉదాహరణకు 2014 ఖరీఫ్ లో సంభవించిన కరువుకు 2015 నవంబర్‌లో, 2015 కరువుకు 2016 నవంబర్‌లో సాయం అందించారు. 2015 నవంబర్, డిసెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ.260.43 కోట్ల పంట నష్టానికి అందించిన సాయం ‘‘సున్నా’’. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగిసేలోపే పరిహారం ఇచ్చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?
రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చి దిగిపోయే నాటికి రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చిన చరిత్ర మీది. ఇప్పుడు అన్నదాతకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న హామీపై ఖరీఫ్ దాటిపోయినా ఉలుకూ పలుకూ లేదు. రైతన్నలకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు వైఎస్సార్‌సీపీ హయాంలో అందించారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?
2014-19 మధ్య మీరు ఇచ్చిన పంట రుణాలు రూ.3.64 లక్షల కోట్లు మాత్రమే. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన పంట రుణాలు రూ.8.70 లక్షల కోట్లు. మరి ఎవరిది దరిద్రపు పాలన?
ఆత్మ హత్య చేసుకున్న రైతులను ఆదుకోవడం మాని వ్యసనాలకు బానిసై ఆత్మహత్య చేసుకున్నారని ముద్ర వేశారు. నీ హయాంలో ఆత్మహత్య చేసుకున్నవారిని కూడా వైఎస్ జగన్ ఆదుకున్నారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?
మీ హయాంలో పాడి రైతులను పట్టించుకోకుండా ప్రయివేటు డెయిరీలకు మాత్రమే ప్రయోజనం కలిగేలా చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి రైతులకు మేలు చేస్తూ అమూల్‌తో ఒప్పందం ద్వారా ప్రతి లీటరుకు రూ.10 నుంచి రూ.17 వరకు అదనపు ఆదాయం వచ్చేలా చేశారు. పశువులకు అంబులెన్స్, ఉచిత బీమా అమలు చేశారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?’ అంటూ పోస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment