నాంపల్లిగుట్టపై చిన్నచూపు
● అభివృద్ధి అంతంతే.. ● కంపుకొడుతున్న పరిసరాలు ● ఇబ్బందులు పడుతున్న భక్తులు
వేములవాడఅర్బన్: శ్రీరాజరాజేశ్వరస్వామి అనుబంధ నాంపల్లిగుట్టపై వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధిపై పాలకులకు పట్టింపు కరువైంది. ఎన్ని ప్రభుత్వలు మారినా గుట్టను అభివృద్ధి చేయడం లేదని స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసినా అమలుకు నోచుకోలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నాంపల్లిగుట్టను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
గతంలో ప్రతిపాదిత పనులు ఇవీ..
● 2015లో అప్పటి సీఎం కేసీఆర్ నాంపల్లిగుట్టను సందర్శించిన సమయంలో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీటీడీఏ) పర్యాటకశాఖ దేవాదాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. సుమారుగా 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గుట్టపై సుమారు రూ.29కోట్లతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
● నాంపల్లి గుట్టపై నుంచి అందమైన పరిసర ప్రాంతాలను వీక్షించేందుకు మనోరమ వ్యూ పాయింట్ ఏర్పాటు.
● మధ్యమానేరు వ్యూ, హోటల్, రాతిశిలల మధ్య కోనేటి నిర్మాణం.
● గుట్టపై మహామండపం నిర్మాణం.
● కల్యాణ వేదిక, వసతిగృహాలు.
● బిర్లా ప్లానేటోరియం, ధ్యాన మందిరం.
● గుట్ట కింద నుంచి పైకి రోప్‌వే నిర్మాణం.
● గుట్టపైకి రెండు వరుసల ఘాట్‌రోడ్డు నిర్మాణం.
పేరుకుపోయిన సమస్యలు
● నాంపల్లిగుట్టపైన వాటర్ ఫౌంటేయిన్ నిరుపయోగంగా మారింది.
● వాటర్ ఫౌంటేయిన్ చుట్టూ గార్డెన్‌లో పిచ్చిమొక్కలు మొలిచాయి.
● గుట్టపై పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.
● గుట్టపై నలుగురు స్వీపర్లు ఉన్నా.. అందులో ఇద్దరు లడ్డూ కౌంటర్‌లోనే ఉంటున్నారు.
● మరో నలుగురు స్వీపర్లను నియమించాలి.
● తాత్కాలిక రేకులషెడ్లు, మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలి.
● కాళీయమర్ధనం ఎదుట మరో వాటర్‌ట్యాంక్.
● భక్తులకు స్నానపు గదులు.
● గుట్టపై గల శ్రీహనుమాన్ ఆలయానికి దారి.
● పాతకోనేరును శుభ్రం చేయించాలి.
● నవనాటి సిద్ధులగృహను శుభ్రం చేయించాలి.
● గుట్టపై తాత్కాలిక మరుగుదొడ్లు నిరుపమోగంగా మారాయి.
● కొత్తగా మరికొన్ని మరుగుదొడ్లు నిర్మించాలి.
గుట్టను అభివృద్ధి చేయండి
నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా గుట్టపై అభివృద్ధి పనులు కావడం లేదు. నిత్యం భక్తుల సందడి, ఆహ్లాదకరంగా ఉండే నాంపల్లిగుట్లపై సౌకర్యాలు కల్పించాలి. – బొల్గం నాగరాజు, నాంపల్లి
వసతులు కల్పిస్తున్నాం
నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి గుట్టపై భక్తులకు వసతులు కల్పిస్తున్నాం. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాం. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూస్తాం.
– నరేందర్, నాంపల్లి ఆలయ ఇన్‌చార్జి
Comments
Please login to add a commentAdd a comment