డిమాండ్లు నెరవేర్చాలి
సిరిసిల్లటౌన్: ప్రభుత్వం సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని ఎస్‌ఎస్ ఉద్యోగుల జాక్ రాష్ట్ర అధ్యక్షుడు దుండిగల్ యాదగిరి డిమాండ్ చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ చౌరస్తా వద్ద 20 రోజులుగా చేస్తున్న ఉద్యోగుల దీక్షను ఆదివారం సందర్శించి మాట్లాడారు. కస్తూర్బా పాఠశాలలో ఉపాధ్యాయుల తాత్కాలిక సర్దుబాటు చేయడం పరిష్కారం కాదన్నారు. ప్రభుత్వం ఇలాంటి దాటవేసే ధోరణి వీడనాడాలని కోరారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేస్తూ, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని కోరారు. ఏళ్ల తరబడిగా ఉద్యోగం చేస్తున్నా కనీస వేతనం, ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు. కరీంనగర్ జిల్లా జాక్ అధ్యక్షుడు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రగిరి మహేశ్, రాజన్నసిరిసిల్ల జిల్లా అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.
● జాక్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి
Comments
Please login to add a commentAdd a comment