అమ్మిందే మాంసం !
● సిరిసిల్లలో వ్యాపారుల వింత పోకడ
● పదిహేడేళ్లుగా స్లాటర్‌హౌస్ లేదు
● అధికారులకు పట్టింపు లేదు
కనిపించని మున్సిపల్ మార్క్
సిరిసిల్ల పట్టణంలో గొర్రె, మేక మాంసం విక్రయాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించడం లేదు. దశాబ్దంన్నరకు పైగా సాగుతున్న తంతుకు పాలకులు స్వస్తి పలకడం లేదు. తరచూ స్లాటర్‌హౌస్ ప్రారంభిస్తామంటూ హడావిడి చేసి తర్వాత మిన్నకుండడం సిరిసిల్ల బల్దియాకు అలవాటైపోయిందని ప్రజలు విమర్శిస్తున్నారు. నిజానికై తే మున్సిపాలిటీల్లో మాంసం విక్రయాలపై అధికారులు నిబంధనల ప్రకారం అమ్మకాలపై పర్యవేక్షణ చేయాలి. వ్యాపారీ గొర్రెను లేదా మేకను కోసేముందు వెటర్నరీ(పశువైద్యుడు) పరీక్షించి దాని నాణ్యతను గుర్తించాల్సి ఉంటుంది. తదుపరి మున్సిపల్ సంబంధిత అధికారి కార్యాలయం సిబ్బంది సీల్ వేస్తారు. ఆ తర్వాతే వ్యాపారులు దుకాణాలకు మాంసం తరలించి విక్రయించాలి. ప్రతిరోజు క్వింటాళ్ల కొద్దీ మాంసం విక్రయాలు జరుగుతాయి. ఇక ఆదివారం సాధారణ రోజులతో పోల్చితే పదింతలు ఎక్కువగా ఉంటుంది.
స్లాటర్‌హౌస్ కథా ఏమైనట్టో..
గ్రామపంచాయతీ హయాంలోనే సిరిసిల్లలో స్లాటర్‌హౌస్ ఉండేది. ప్రస్తుతం జిల్లా పోలీస్(ఎస్పీ) ఆఫీస్ పక్కన ఇప్పుడు మున్సిపల్ వారు నిర్మించిన స్విమ్మింగ్‌ఫూల్ స్థానంలో ఉండేది. మార్కెట్‌లో కూడా ప్రత్యేకంగా మాంసం అమ్మకాల కోసం నిర్మించిన దుకాణ సముదాయం ఉండేది. 17 క్రితం వీటిని అప్పటి కౌన్సిల్ అనుమతిలో కూల్చేశారు. పట్టణ శివారులోని మున్సిపల్ లేఅవుట్ స్థలాన్ని స్లాటర్‌హౌస్‌కు కేటాయించారు. దాని టెండర్లు పూర్తవగా కాంట్రాక్టర్ నిర్ణీత సమయానికి నిర్మించి ఇవ్వలేదు. అప్పటి నుంచి సిరిసిల్లలో స్లాటర్‌హౌస్ లేదు. మున్సిపల్ వారు స్లాటర్‌హౌస్‌కు కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తర్వాత స్లాటర్‌హౌస్ కోసం మున్సిపల్ అధికారులు మానేరునది ఒడ్డున స్థలం కేటాయించినా నిర్మాణానికి నోచుకోలేదు. చివరికి ఎనిమిదేళ్ల క్రితం కార్గిల్‌లేక్ చెరువుపక్కనే మున్సిపల్‌కు చెందిన రెండు గుంటల స్థలాన్ని కేటాయించి రూ.5లక్షలు వెచ్చించి తాత్కాలికంగా షెడ్డును నిర్మించారు. దాన్ని ఇప్పటి వరకు ప్రారంభించలేదు.
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో వ్యాపారులు అమ్మిందే మాంసంగా మారింది. నాణ్యత గల మాంసం విక్రయించడం లేదు.
అయినా సిరిసిల్ల బల్దియా అధికారులు ఏళ్లుగా పట్టించుకోవడం లేదు. వెటర్నరీ అధికారులు పరీక్షించి, సీల్ వేసిన
తర్వాతనే మాంసాన్ని విక్రయించాల్సి
ఉంటుంది. కానీ జిల్లా కేంద్రంలో
ఇలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఫలితంగా పట్టణ ప్రజలు ఏది మంచి మాంసమో.. ఏది కాదో తెలుసుకో
లేకపోతున్నారు. గత్యంతంర లేక వ్యాపారులు ఇచ్చిందే మాంసంగా తీసుకుంటున్నారు. దీనిపై సాక్షి ప్రత్యేక కథనం.
త్వరలోనే స్లాటర్‌హౌస్ ప్రారంభిస్తాం
పదిహేను రోజుల్లో కార్గిల్‌లేక్ వద్ద గల స్లాటర్‌హౌస్‌ను ప్రారంభిస్తాం. మాంసం విక్రయాలు, జీవాల వధపై వ్యాపారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇక రైతుబజారు పక్కనే ఇంటిగ్రేటెడ్ స్లాటర్‌హౌస్ నిర్మాణం అంశం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలకు నాణమైన మాంసం అందించడానికి కృషి చేస్తాం.
– దుబ్బాక లావణ్య, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment