రోడ్డు నిబంధనలు పాటించాలి
● జిల్లా రవాణాఽధికారి వి.లక్ష్మణ్
సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: డ్రైవర్లు రోడ్డు నిబంధనలు పాటించాలని డీటీవో లక్ష్మణ్ కోరారు. సిరిసిల్లలో బుధవారం ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించక పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎంవీఐ వంశీధర్ ఏఎంవీఐలు రజనీదేవి, పృథ్వీరాజ్‌వర్మ, కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, హోమ్‌గార్డ్ ఎల్లేశ్, లారీ, కార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, డ్రైవర్స్ 100 మంది వరకు పాల్గొన్నారు.
రోడ్డు భద్రత మాసోత్సవాలు
వేములవాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్డు భద్రత మాసోత్సవాలను సిరిసిల్ల ఎంవీఐ వంశీధర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. డిపో మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment