రౌడీషీటర్ల కదలికలపై నిఘా
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● చందుర్తి ఠాణా తనిఖీ
చందుర్తి(వేములవాడ): రౌడీషీటర్ల కదలికపై నిఘా పెట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. చందుర్తి పోలీస్‌స్టేసన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల ను పరిశీలించి, సిబ్బంది విధులపై ఆరా తీశా రు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతు ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. సిబ్బందికి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. డయల్ 100 కాల్స్‌కు బ్లూకోల్ట్స్, పెట్రోకార్ సిబ్బంది తక్షణమే స్పందించాలని కోరారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అంజయ్య తదితరుల ఉన్నారు.
130 మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసులు
సిరిసిల్లక్రైం/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జిల్లా ప్రజలు డిసెంబర్ 31వ తేదీన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మద్యంబాబులు అయితే తెగ తాగేశారు. అయితే మద్యం తాగిన తర్వాత వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డారు. ఇలా డ్రంకెన్‌డ్రైవ్ చేసిన వారిని పట్టుకొని జిల్లా వ్యాప్తంగా 130 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్ తెలిపారు.
అర్ధరాత్రి వరకు తనిఖీలు
జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి దాటినా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలను పోలీసులు కొనసాగించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 15 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా విడిపోయి గొల్లపల్లి, వెంకటాపూర్, ఎల్లారెడ్డిపేటలోని రెండు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఎస్సై రమాకాంత్ పెట్రోలింగ్ చేశారు. ముస్తాబాద్ మండలంలో 20 మందిపై డ్రంకెన్‌డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆవునూర్, పోతుగల్, నామాపూర్, గూడెం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.
మానేరు చివరి ఆయకట్టుకు నీరందిస్తాం
● ఇరిగేషన్ డీఈఈ రవికుమార్
ముస్తాబాద్(సిరిసిల్ల): మానేరు ప్రాజెక్టు తైబందీ తీర్మానం మేరకు చివరి ఆయకట్టుకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ డీఈఈ రవికుమార్ తెలిపారు. గూడూరు నుంచి ముస్తాబాద్, తెర్లుమద్ది వరకు మానేరుకెనాల్‌లో ఉన్న చెత్త, గుర్రపుడెక్క, తుంగను బుధవారం జేసీబీతో తొలగించారు. డీఈఈ మాట్లాడుతూ ప్రాజెక్టులో నీరున్నా కెనాల్స్ సరిగ్గా లేకపోవడంతో నీటి ప్రవాహం తగ్గిందన్నారు. రైతుల కోరిక మేరకు కెనాల్స్‌ను శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు. తైబందీ తీర్మానం మేరకు నీటి విడుదల కొనసాగుతుందని, రైతులు సహకరించాలని కోరారు. వారానికి రెండుసార్లు తెర్లుమద్దికి సాగునీటిని విడుదల చేస్తామన్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజు, లష్కర్లు పాల్గొన్నారు.
అనంతారం చెరువులోకి నీరు వదలండి
ఇల్లంతకుంట(మానకొండూర్): అనంతారం చెరువులోకి నీటిని విడుదల చేయాలని కోరుతూ జంగారెడ్డిపల్లి కాంగ్రెస్ నాయకులు మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు విన్నవించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేను బుధవారం శనిగరం స్టేజీ వద్ద కలిశారు. అనంతగిరి జలాశయం నుంచి నీటిని వదిలి అనంతారం ప్రాజెక్టును నింపాలని కోరారు. నాయకులు మంద బాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment