సీఎం కప్ పోటీల్లో జిల్లాకు పతకాలు
సిరిసిల్లకల్చరల్/గంభీరావుపేట(సిరిసిల్ల): సీఎం కప్.. యోగా పోటీల్లో జిల్లా విద్యార్థులు రజత పతకాలు సాధించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పోటీల్లో వెలిచాల అర్విన్, స్వర్గం విష్ణుప్రసాద్ రజత పతకాలు సాధించారు. విద్యార్థులను జిల్లా క్రీడల అధికారి అజ్మీర రాందాస్, స్కూల్ హెచ్‌ఎం చకినాల శ్రీనివాస్, జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్, యోగాచార్యుడు ఉప్పల శ్రీనివాస్, శ్రీకాంత్, కృష్ణ, డేవిడ్, శంకర్ అభినందించారు.
ఉషు పోటీల్లో పతకాలు
సీఎం కప్–2024 రాష్ట్రస్థాయి ఉషు పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఐదు పతకాలు సాధించినట్లు కోచ్ విక్రమ్‌గాంధీ తెలిపారు. అండర్–14 బాలుర విభాగంలో నిఖిలేశ్ 33 కిలోల విభాగంలో కాంస్యం, అండర్–18 బాలికలలో ప్రవళిక 52 కిలోల విభాగంలో కాంస్యం, 60 కిలోలలో పూజ కాంస్యం, అండర్–18 బాలురలో త్రిశాంత్ 52 కిలోలలో కాంస్యం, లోకేశ్ 60 కిలోలలో కాంస్యం పతకాలు సాధించినట్లు కోచ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment