ట్రాక్టర్ వచ్చె.. కాడెడ్లకు విశ్రాంతినిచ్చె..
సిరిసిల్ల: ట్రాక్టర్ల రాకతో వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఎడ్లతో వ్యవసాయం చేసే రోజుల్లో ఒక్క నాగలితే ఐదు ఎకరాలకు మించి సాగు సాధ్యం కాకపోయేది. కానీ ఇప్పుడు ట్రాక్టర్ల ఆగమనంతో ఎకరాల కొద్ది భూములు సాగుచేస్తున్నారు. ఫలితంగా పుట్ల కొద్ది ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారు. ట్రాక్టర్ రాకతో చాలా గ్రామాల్లో ఎడ్లతో వ్యవసాయం చేయడం లేదు. కోనరావుపేట మండలం బావుసాయిపేట శివారులో ఓ రైతు తన పొలం వద్ద ఎడ్లకు విశ్రాంతినిస్తూ కనిపించాడు. అయితే వాటి పక్కనే ట్రాక్టర్ కనిపించింది. యాంత్రీకరణతో ఎడ్లకు కాస్త విరామం దొరికినట్లు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment