ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..! | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!

Published Fri, Feb 7 2025 12:44 AM | Last Updated on Fri, Feb 7 2025 12:44 AM

ఇక్కడ

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!

● జిల్లాలో విభిన్న పరిస్థితుల్లో పంటల సాగు ● బోయినపల్లికి వరప్రదాయినిగా వరదకాలువ ● ముస్తాబాద్‌కు మల్లన్నసాగర్‌నీటితో హరితశోభ ● ఎల్లారెడ్డిపేటలో ఎండుతున్న పంటపొలాలు

ఒకే ప్రాంతంలోని రైతులు విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట మండలాలు పక్కపక్కనే ఉంటాయి. ముస్తాబాద్‌ మండలంలోని ఆయకట్టుకు మల్లన్నసాగర్‌ నీరు జవసత్వాలు అందిస్తుండగా.. ఎల్లారెడ్డిపేట వరప్రదాయిని అయిన సింగసముద్రం కాలువలు సరిగ్గా లేక చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయి. ఇదే సమయంలో జిల్లాలోని దిగువ ప్రాంతమైన బోయినపల్లి మండలంలోని వరదకాలువ నీటితో కనుచూపు మేరలో పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. మూడు మండలాల్లోని రైతులు, పంటల సాగుపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు..

బోయినపల్లి(చొప్పదండి): యాసంగి సీజన్‌లోనూ మిడ్‌మానేరు వరదకాలువ పరిసరాల్లోని పంటల భూములు సస్యశ్యామలంగా ఉన్నాయి. కనుచూపుమేరలో పచ్చని పంటపొలాలతో దర్శనమిస్తున్నాయి. వరదకాలువ ఆధారంగా రాజన్న సిరిసిల్ల బోయినపల్లి, కరీంనగర్‌ జిల్లా గంగాధర, రామడుగు మండలాల్లోని విలాసాగర్‌, మర్లపేట, దేశాయిపల్లి, రత్నంపేట, వరదవెల్లి, కొండన్నపల్లి, కురిక్యాల, ఆచంపల్లి, షానగర్‌ గ్రామాల్లో 2వేలకు పైగా ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వరదకాలువ నుంచి పైపులైన్లు వేసుకుని మోటార్ల ద్వారా పంటలకు నీరు అందిస్తున్నారు. వరద కాలువ 1.7 టీఎంసీల నీటి స్టోరేజీ కెపాసిటీతో పారుతుంటోంది. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్‌ రెగ్యూలేటర్‌ వరకు 122 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వరదకాలువ పూర్తిగా నిండితే సుమారు 18 మీటర్ల లోతు వరకు నీరు ఉంటుంది. ప్రస్తుతం ఐదు మీటర్ల మేర లోతులో నీరు ఉందని రైతులు చెబుతున్నారు. వరదకాలువ అడుగు బాగాన 43 మీటర్ల వెడల్పు ఉంటుంది.

ఐదు డివిజన్లుగా కాలువ

వరదకాలువను ఐదు డివిజన్లుగా విభజించారు. ఎస్సారెస్పీ జీరో పాయింట్‌ నుంచి 28 కి.మీ వరకు ఒక డివిజన్‌, 28 కి.మీ నుంచి 44 వరకు రెండో డివిజన్‌, 44 కి.మీ నుంచి 73 వరకు మూడో డివిజన్‌, 73 కి.మీ నుంచి 102 కి.మీ వరకు నాలుగో డివిజన్‌, 102 కి.మీ నుంచి 122 కి.మీ వరకు ఐదో డివిజన్‌గా ఏర్పాటు చేసుకున్నారు. దీని పరిధిలో ఐదుగురు ఈఈలు, ఇద్దరు ఎస్‌ఈలు పర్యవేక్షిస్తారు.

ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నీరు

ఎస్సారెస్పీ ద్వారా విడుదల చేసిన నీరు వరదకాలువ మీదుగా మిడ్‌మానేరులోకి వెళ్తుంది. మొదట ఎస్సారెస్పీ నుంచే వరదకాలువకు నీరు విడుదల చేసేవారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు సైతం విడుదల చేస్తున్నారు.

ఎగువమానేరు ప్రాజెక్టులోకి కూడవెల్లి వాగు ద్వారా వస్తున్న గోదావరి నీరు

ముస్తాబాద్‌(సిరిసిల్ల): కరువు సీమకు మరోసారి గోదావరి నీరు చేరింది. యాసంగి సాగుకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నతరుణంలో మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని అధికారులు విడుదల చేశారు. కాంగ్రెస్‌ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి చొరవతో ఎగువమానేరు ప్రాజెక్టుకు నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు నీటిని ప్యాకేజీ 12 ద్వారా దుబ్బాక మీదుగా ముస్తాబాద్‌ మండలానికి విడుదల చేశారు. రాజక్కపేట మీదుగా మోహినికుంట, మద్దికుంట, చీకోడు, చిప్పలపల్లి, నామాపూర్‌ గ్రామాలకు గోదావరి నీరు వస్తోంది. మద్దికుంట ఊర చెరువు, చీకోడు చింతల చెరువు, ఊరు చెరువుల్లోకి నీరు వస్తోంది.

తైబందీ ప్రకారం సాగు

ఎగువమానేరు ప్రాజెక్టుపై ఆధారపడి 15 వేల ఎకరాలు సాగుచేస్తున్నారు. యాసంగికి అధికారులు తైబందీ నిర్వహించి.. కుడి కాలువ కింద 10వేల ఎకరాలు, ఎడమ కాలువ కింద 5వేల ఎకరాలుగా ఆయకట్టు నిర్ణయించారు. రెండు నెలల తిరగక ముందే ప్రాజెక్టు ఖాళీ అయ్యే పరిస్థితి రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో కేకే మహేందర్‌రెడ్డి నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి.. మల్లన్నసాగర్‌ నీటిని విడుదల చేయించారు. ఈ నీరు కూడవెళ్లి వాగు ద్వారా దుబ్బాక నియోజకవర్గంలోని 20 చెక్‌డ్యామ్‌లను నింపుతూ.. ఎగువమానేరు ప్రాజెక్టుకు గురువారం చేరుకుంది. ముస్తాబాద్‌ పెద్దచెరువు, లింగంకుంటలకు నీరు వస్తోంది. ఈనెల 3న 578 క్యూసెక్కులు, 4న 694, 5న 578, 6న 694 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఇప్పటి వరకు 2,544 క్యూసెక్కుల నీరు ఎగువమానేరులోకి వచ్చిందని డీఈఈ రవికుమార్‌ తెలిపారు. మొత్తం ఒక్క టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

వరదకాలువ..

హరితమయం

ఎనిమిది ఎకరాలు వరి వేసిన

విలాసాగర్‌ వరదకాలువ పరిసరాల్లో 8 ఎకరాలలో వరి పంట సాగుచేస్తున్నాను. కాలువ నుంచి 400 మీటర్ల పైప్‌లైన్‌ వేసుకున్నాను. గత వానాకాలం సీజన్‌లోనూ 8 ఎకరాలు వరి పంట వేశాను. మాకు వరదకాలువ నీరు వరంలా మారింది. – గంగాధర కనుకయ్య, విలాసాగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!1
1/4

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!2
2/4

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!3
3/4

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!4
4/4

ఇక్కడ గలగల.. అక్కడ వెలవెల..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement