ప్రభుత్వ బడిలో చదవాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● తంగళ్లపల్లి పీహెచ్‌సీ, చీర్లవంచ స్కూల్ తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామాల్లోని పిల్లలు ప్రభుత్వ బడిలోనే చదివేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు చీర్లవంచ ప్రాథమిక పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణ, గ్రామంలోని రోడ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి ఇబ్బందులు ఉంటే చెప్పాలన్నారు. వాటర్ ప్యూరిఫయర్, ఫ్యాన్లు మరమ్మతు చేయించాలని సూచించారు. పీహెచ్‌సీ వైద్యులుతో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల్లోనే 75 శాతం ప్రసవాలు అయ్యేలా చూడాలన్నారు. తంగళ్లపల్లి పీహెచ్‌సీ ఆవరణలో గడ్డి, పిచ్చిమొక్కలు తొలగించాలన్నారు. ఎంపీవో మీర్జా అఫ్జల్ బేగ్, డాక్టర్ అఫీజా బేగం తదితరులు పాల్గొన్నారు.
వ్యాక్సిన్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వికటించి 45 రోజుల చిన్నారి మృతిచెందిన ఘటనలో బాధిత కుటుంబానికి రూ.లక్ష చెక్కును కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా గురువారం అందించారు. నేరెళ్లకు చెందిన దాసరి రమేశ్, లలిత దంపతుల 45 రోజుల పాపకు బుధవారం పీహెచ్‌సీలో వ్యాక్సిన్ ఇవ్వగా.. అది వికటించి మరణించినట్లు బాధితులు ఆరోపించారు. తక్షణ సాయంగా బుధవారం రాత్రి రూ.లక్ష చెక్కును సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి అందించగా.. మరో రూ.లక్ష చెక్కును కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కలెక్టరేట్‌లో పాప తండ్రి రమేశ్‌కు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment