![కేంద్రానిది ప్రజావ్యతిరేక బడ్జెట్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06srl26-180045_mr-1738869043-0.jpg.webp?itok=q27kden0)
కేంద్రానిది ప్రజావ్యతిరేక బడ్జెట్
● తెలంగాణకు తీరని అన్యాయం ● కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
సిరిసిల్లటౌన్: కేంద్రం ప్రభుత్వ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూలంగా ఉందని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు విమర్శించారు. బడ్జెట్‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని దుయ్యబట్టారు. బడ్జెట్‌ను నిరసిస్తూ ఈనెల 10న ప్రజాసంఘాల పోరాటవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్, ఇందిరా పార్క్ మహాధర్నా పోస్టర్‌లను సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. నాయకులు కోడం రమణ, మూశం రమేశ్, అన్నల్‌దాస్ గణేష్, సూరం పద్మ, జవ్వాజి విమల, ఎర్రవల్లి నాగరాజు, ఆదిత్య, నక్క దేవదాస్, ఒడ్నాల వీరేశం, గడ్డం రాజశేఖర్, శ్రీనివాస్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment