ఆసియాకప్-2023కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా జరగనున్న పాకిస్తాన్-నేపాల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం ఈ ఈవెంట్‌లో ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి. పాకిస్తాన్, నేపాల్, భారత్ జట్లు గ్రూపు-ఏ లో ఉండగా.. ఆఫ్గానిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ గ్రూపు-బిలో ఉన్నాయి. కాగా నేపాల్ జట్టు తొలిసారి ఆసియాకప్ అర్హత సాధించింది.
చెమటోడ్చుతున్న రోహిత్ సేన..
ఇక ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టు సిద్దమవుతోంది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో టీమిండియా చెమటోడ్చుతోంది. ఇక ఇప్పటికే టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి యో- యో టెస్టును క్లియర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిట్‌నెస్ పరీక్షలో కింగ్ కోహ్లి 17.2 స్కోర్ చేశాడు.
తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు మిగితా సభ్యులు కూడా ఈ యో- యో టెస్టులో పాసైనట్లు తెలుస్తోంది. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం ఈ ఫిట్‌నెస్ టెస్టుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అతడు ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. కేఎల్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరికొంత సమయం పట్టనున్నట్లు టీమిండియా ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సైతం చెప్పుకొచ్చాడు.
జట్టుతో కలవనున్న ఆ నలుగురు..
మరోవైపు ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకున్న జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, తిలక్ వర్మ.. స్టాండ్‌బైగా ఎంపికైన సంజూ శాంసన్ శుక్రవారం భారత జట్టుతో కలవనున్నారు. వీరి నలుగురు ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో భాగమయ్యారు. ఐరీష్ పర్యటన ముగియడంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు.
చదవండి: PAK vs AFG: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం! కోహ్లికి కూడా సాధ్యం కాలేదు! ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా
Comments
Please login to add a commentAdd a comment