పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో పాకిస్తాన్ కెప్టెన్సీకి ఆజం రాజీనామా చేశాడు. వన్డే వరల్డ్‌కప్‌లో తమ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ బాబర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బుధవారం ఆజం వెల్లడించాడు.
"మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావించాను. కెప్టెన్సీకి రాజీనామా చేసినప్పటికీ.. మూడు ఫార్మాట్లలోనూ పాకిస్తాన్ ఆటగాడిగా కొనసాగుతాను.
కొత్త కెప్టెన్‌గా ఎవరు వచ్చిన నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. చివరగా నాకు ఈ అవకాశమిచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు" అని బాబర్ పేర్కొన్నాడు. కాగా 2019లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆజం.. పాకిస్తాన్‌కు ఎన్నో అద్బుతమైన విజయాలు అందించాడు.
అతడి సారథ్యంలో పాకిస్తాన్ వన్డేల్లో నెం1 జట్టుగా నిలిచింది. కాగా పాకిస్తాన్ కెప్టెన్‌గా మహ్మద్ రిజ్వాన్ బాధ్యతలు చేపట్టే అవకాశముంది. డిసెంబర్ మొదటి వారంలో పాకిస్తాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. దీంతో ఈ పర్యటనకు ముందే పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్ ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment