Ind Vs Aus: Fans Roast KL Rahul After He Failed In Indias 1st Innings In BGT Opening Test - Sakshi
Sakshi News home page

IND Vs AUS: నీ కంటే గిల్‌ వంద రెట్లు బెటర్‌.. మరి నీవు మారవా రాహుల్‌?

Published Fri, Feb 10 2023 11:47 AM | Last Updated on Fri, Feb 10 2023 1:49 PM

Fans roast KL Rahul after he failed in Indias 1st innings BGT - Sakshi

టీమిండియా స్టార్ బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ మరోసారి తన ఆటతీరుతో నిరాశ పరిచాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్‌కు దూరంగా రాహుల్‌.. తిరిగి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు జట్టులోకి వచ్చాడు.

అయితే నాగ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరగుతోన్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో రాహుల్‌ దారుణంగా విఫలమయ్యాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొవడానికి ఇబ్బంది పడ్డ రాహుల్‌.. ఆఖరికి అరంగేట్ర స్పిన్నర్‌ టాడ్‌ మార్ఫీ బౌలింగ్‌లో ఈజీ రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 71 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు రాహుల్‌. అతడి ఇన్నింగ్స్‌ కేవలం ఒక్క బౌండరీ మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ దారుణ ప్రదర్శన పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సెంచరీల మోత మోగిస్తున్న యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ను కాదని రాహుల్‌కు ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో గిల్‌కు మద్దతుగా కూడా నెటిజన్లు నిలుస్తున్నారు. ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. మరి నీవు మారవా రాహుల్‌, నీ కంటే గిల్‌ వంద రెట్లు బెటర్‌ అంటూ కామెంట్‌ చేశారు. మరో యూజర్‌ స్పందిస్తూ..  "కెఎల్ రాహుల్ భారత్ తరపున మరో టెస్టు మ్యాచ్‌లో చూడాలి అనుకోవడం లేదు. వెంటనే అతడిని జట్టు నుంచి తీసియండి"అంటూ పోస్ట్‌ చేశాడు. కాగా రాహుల్‌ గత 10 టెస్టు ఇన్నింగ్స్‌లలో కేవలం 180 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 50 పరుగులు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది.
చదవండి: IND vs AUS: మీ ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉంది సర్‌: కేఎస్‌ భరత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement