నాటింగ్‌హమ్: ఇంగ్లండ్, భారత్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో కేఎల్ రాహుల్, ఇంగ్లండ్ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్ సమమంలో కేఎల్ రాహుల్ 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇది జరిగింది. విషయంలోకి వెళితే.. కేఎల్ రాహుల్ రిషబ్ పంత్‌తో చర్చిస్తుండగా రాబిన్‌సన్‌ను లెగ్‌సైడ్‌లో తగిలినట్లు కనిపించింది. దీంతో రాబిన్‌సన్ ఏదో అనుకుంటూ వెళ్లిపోతుండగా రాహుల్ కూడా దీటుగా రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ పూర్తి చేసుకొని వెళ్తున్న రాబిన్‌సన్ రాహుల్ పక్క నుంచి వెళ్తూ అతని భుజాన్ని గుద్దుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలు అక్కడి కెమెరాల్లో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక మ్యాచ్‌లో రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఒకవైపు సహచరులంతా తక్కువ స్కోరుకే వెనుదిరుగుతున్నా తాను మాత్రం నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 84 పరుగులు చేసిన రాహుల్ అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శతకం చేసే అవకాశం చేజార్చుకున్నాడు. కాగా రవీంద్ర జడేజా 56 పరుగులతో రాణించాడు. చివరలో బుమ్రా 28 పరుగులు చేయడంతో ఇంగ్లండ్‌పై 95 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ ఐదు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్ నాలుగు వికెట్లు తీశాడు.
— Rishobpuant (@rishobpuant) August 6, 2021
Comments
Please login to add a commentAdd a comment