ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించి ఆ బాధ్యతలను గుజరాత్ నుంచి వలస వచ్చి హార్దిక్ పాండ్యకు అప్పజెప్పడాన్ని హిట్‌మ్యాన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంఐ యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వారు హార్దిక్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. హార్దిక్ బహిరంగంగా కనపడిన ప్రతిసారి నోటితో పాటు చేతులకు కూడా పని చెబుతున్నారు (ఖాళీ బాటిళ్లను విసరడం). మైదానంలో అయితే హార్దిక్‌పై దూషణల పర్వం శృతి మించుతుంది. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ హార్దిక్‌కు మద్దతుగా నిలుస్తూ, అదనపు సెక్యూరిటీని కల్పిస్తున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో ఆడే మ్యాచ్‌ల సందర్భంగా హార్దిక్‌ను ఎవరైనా టార్గెట్ చేస్తే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎంసీఏ పోలీసులను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై ఎంసీఏ స్పందించింది.
MCA Statement:
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2024
"There are rumours that MCA has instructed security against people who support Rohit or boo Hardik, this is incorrect and baseless rumours, no instructions have been given". pic.twitter.com/6Yoa0MVbG5
హార్దిక్ విషయంలో తాము పోలీసులకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. మైదానంలో మ్యాచ్ చూసేందుక వచ్చే ప్రేక్షకుల విషయంలో బీసీసీఐ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తామని వివరణ ఇచ్చింది. అయితే వ్యక్తిగతంగా ఎవరినైనా టార్గెట్ చేయడం సమర్దనీయం కాదని పేర్కొంది.
కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో హార్దిక్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌లో రేపు సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే హార్దిక్‌ను అదనపు సెక్యూరిటీ కల్పిస్తారని ప్రచారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment